ఏపీలో కన్నా ఔట్…. టీడీపీకి బీజేపీ బంపర్ ఆఫర్

ఏపీలో కన్నా ఔట్.... టీడీపీకి బీజేపీ బంపర్ ఆఫర్

0

ప్రస్తుతం ఏపీలో బీజేపీ వార్డు మెంబర్ గా కూడా పోటీ చేసి గెలవలేని స్థితిలో ఉంది…. పొత్తులో భాగంగా బీజేపీ 2014 ఎన్నికల్లో అక్కడక్కడా గెలిచినప్పటికీ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.

పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి డిపాజిట్ కూడా తెచ్చుకోలేపోయారు. దీంతో బీజేపీ చతికిల పడింది… అయితే కేంద్రంలో మోదీ నాయత్వం మరోసారి ఏర్పడటంతో కన్నాకు పెద్ద టాస్క్ పడింది.

అధికార వైసీపీని టీడీపీని ఎదుర్కునే టాస్క్ రావడంతో ప్రస్తుతం ఆయన ఈ టాస్క్ ను విజయవంతం చేయలేకపోతున్నారని గ్రహించి కన్నా భాధ్యతలను ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన రాజ్యసభ సభ్యుల్లో ఒకరికి అప్పజెప్పాలని చూస్తోందంట. దాంతో రానున్న రోజుల్లో టీడీపీ ఖల్లాస్ అవుతుందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైసీపీల మధ్య ప్రధాన పోటీ నడుస్తుందని బీజేపీ అధిష్టానం బావిస్తోందట.