బీజేపీలోకి గంటాతో పాటు మరో మంత్రి

బీజేపీలోకి గంటాతో పాటు మరో మంత్రి

0

తెలుగుదేశం పార్టీకి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేరిక ఇక లాంఛనమే అని వార్తలు వస్తున్నాయి ..ఆయన వైసీపీ వైపు చూడటం లేదు, బీజేపీలోకి వెళ్లాలి అని భావిస్తున్నారు.. అయితే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే విషయంలో మాత్రం ఇంకా డౌట్లు అందరికి వస్తున్నాయి,

అయితే గంటా ఒక్కరేకాదు ఆయన వర్గం చాలా మంది పార్టీ మారే ఆలోచలో ఉన్నారట.. ఆయనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోనున్నారు అని తెలుస్తోంది.

ఈ సమయంలో గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి కూడా బీజేపీ గూటికి చేరాలి అని చూస్తున్నారు. ముఖ్యంగా సుజనా చౌదరితో ఆయన ఇటీవల చర్చించారట… ఆయన కూడా బీజేపీలో చేరాలి అని భావిస్తున్నారట.

ముఖ్యంగా రాజధాని భుముల విషయంలో ఆ మాజీ మంత్రిని వైసీపీ టార్గెట్ చేస్తోంది ..అందుకే ఆయన ముందే పార్టీకి గుడ్ బై చెప్పి కమలం పార్టీలో సేదతీరాలి అని భావిస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. మరి గంటా మాత్రం ఎవరి ఊహకు అందకుండా ఉన్నారు, ఆయన ఎక్కడా పార్టీ మారుతాను అని చెప్పడం లేదు, దీంతో గంటా రాజకీయ అడుగులపై బీజేపీ టీడీపీ వైసీపీ కూడా ఆలోచన చేస్తున్నాయి.