బొక్క బోర్ల పడ్డ వైసీపీ

బొక్క బోర్ల పడ్డ వైసీపీ

0

తెనాలి నుండి పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి, చెప్పులు వేయించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సొంత ఛానల్ లో అడ్డంగా దొరికిపోయాడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు… ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని బుద్దా వెంకన్న ఆరోపించారు…

ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో కాళ్లు పట్టుకొనే పనిలో బిజీగా ఉండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడలేదనుకుంటా అని బుద్దా వెంకన్న ఆరోపించారు.,.. జగన్ బతుకంతా తన మీడియా గ్రాఫిక్స్ తో మేనేజ్ చెయ్యడమే అని ఆయన ఆరోపించారు

అదే పద్ధతి లో ఉన్న అమరావతిని గ్రాఫిక్స్ అంటూ భ్రమ కల్పించబోయి బొక్క బోర్లా పడ్డారని అన్నారు… పెయిడ్ ఆర్టిస్టులు స్వయంగా జగన్ సొంత ఛానల్ లోనే తెనాలి నుండి తీసుకొచ్చారు అని చెప్పడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక జగన్ ఇబ్బంది పడుతున్నారని బుద్దా అన్నారు…