వింత జబ్బుతో బాధపడుతున్న బాలీవుడ్​ హీరోయిన్​..

0

సినీ రంగంలోని చాలా మంది నటులు ఏదో రకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పటికే చాలామంది నటులు క్యాన్సర్​, డిప్రెషన్​ ఇలా అనేక రోగాల బారిన పడగా..మొన్నటికి మొన్న బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్జియాతో అనే అరుదైన వ్యాధితో  బాధపడుతున్నట్టు వార్తలు వచ్చాయి.

షెనాజ్​​ ట్రెజరీ అనే బాలీ వుడ్ హీరోయిన్ ఇష్క్​విష్క్, దిల్లీబెల్లీ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తాను ప్రోసోపాగ్నోసియాతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యాధి కారణంగా తాను ఎవరినీ గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నానని..ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న వ్యక్తులను కూడా గుర్తించలేకపోతున్నానని ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది.

ఈ వ్యాధి బారిన పడడం వల్ల చాలా మంది తమ స్నేహితులను, బంధువులను గుర్తుపట్టలేకపోతున్నట్టు వాపోయింది. ప్రస్తుతం షెనాజ్​​కు ఈ జబ్బు రావడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్టు  సోషల్​మీడియాల్లో పోస్ట్​లు షేర్​ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here