రష్మిక కి బాలీవుడ్ బంపర్ ఆఫర్..!

0

కన్నడ భామ రష్మిక చేసింది నాలుగు సినిమాలే అయినా తెలుగులో మంచి స్టార్ హోదా సంపాదించింది. సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా రష్మిక కి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే తాజాగా ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం కబీర్ సింగ్ సినిమాతో పెద్ద హిట్ సాధించిన షాహిద్ కపూర్ మరో తెలుగు సినిమాని రీమేక్ చేయబోతున్నాడని సమాచారం.

తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమా ని బాలీవుడ్ లో దిల్ రాజు నిర్మించనున్నారు జెర్సీ సినిమా లో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రకు కు రష్మిక ను తీసుకోవాలని అనుకుంటున్నారనీ… ఇప్పటికే షాహిద్ కపూర్ మేకర్స్ ఆమెను సంప్రదించారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.

అయితే అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ రష్మిక ఒప్పుకుంటే ఇది ఆమెకు కు బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఎంతో మంది కొత్త హీరోయిన్లు బాలీవుడ్ లో అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కానీ ఈ భామకు ఆఫర్ ఎదురు చూడకుండానే వచ్చింది