బొత్స ఫ్యామిలీకి జగన్ మరో బంపర్ ఆఫర్

బొత్స ఫ్యామిలీకి జగన్ మరో బంపర్ ఆఫర్

0

ఉత్తరాంధ్రలో ప్రాంతంలో బొత్స సత్యనారాయణకు మంచి గుర్తింపు ఉంది… గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆయన ప్రాధాన్యత తగ్గలేదు… ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్ లో కీలకంగా వహిస్తున్నారు… ఆ నేపథ్యంలో బొత్స ఫ్యామిలీకి జగన్ మరో బంఫర్ ఆఫర్ ప్రకటించినట్లు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది…

పార్టీకోసం నిరంతరం కష్టపడిన బొత్స కుటుంబానికి చెందిన చిన్న శ్రీనుకు జగన్ కీలక బాధ్యలు అప్పజెప్పేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఈ ఎన్నికల్లో బొత్స సన్నిహితులకు అధిష్టానం టికెట్ కేటాయించింది కానీ శ్రీనుకు మాత్రం ఇవ్వలేదు….

ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా శ్రీను పార్టీకోసం పనిచేశారని గుర్తించి ఆయనకు ఉత్తరాంధ్ర ప్రాంతీయ బోర్డ్ చైర్మన్ పదవి అప్పగించాలని చూస్తోంది… ఏపీలో నాలుగు ప్రాంతాలకు నాలుగు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయలనే యోచలో ఉంది అందులో భాగంగానే శ్రీనుకు ఉత్త రాంధ్ర అభివృద్ది బోర్డ్ చైర్మన్ పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి…