ప్రేమించలేదని కత్తితో పొడిచి చంపాడు

ప్రేమించలేదని కత్తితో పొడిచి చంపాడు

0

తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది అత్యంత పాశవికంగా కంతితో పొడిచి చంపాడు… ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో జరిగింది.. కవిటం గ్రామానికి చెందిన సుధాకర్ అనే యువకుడు కొద్దికాలంగా ఓ యువతిని ప్రేమ పేరుతో వెంటపడేవాడు..

ఇటీవలే తాను ప్రేమిస్తున్నానని చెప్పాడు అయితే అతడి ప్రేమని ఆయువతి ఒప్పుకోకపోవడంతో యువకుడు కళాశాలకు వెళ్లేటైమ్ లో కత్తితో పొడిచిచంపాడు.. ఆ తర్వాత ఆయువకుడు కూడా పురుగులమందు తాగా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు…

ఇంతలో స్థానికంగా ఉన్న ప్రజలు అతడిని పోలీసులకు అప్పగించారు… ప్రస్తుతం సుధాకర్ పరిస్థితివిషమంగా ఉంది… కాగా సుధాకర్ కు ఇంతకుముందే వివాహం అయింది విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు..