దేవీ శ్రీ ప్ర‌సాద్ ని ప‌క్క‌న పెట్టిన బోయ‌పాటి

దేవీ శ్రీ ప్ర‌సాద్ ని ప‌క్క‌న పెట్టిన బోయ‌పాటి

0

చాలా మంది ద‌ర్శ‌కులు త‌మ సినిమాకి ఈ టీమ్ అయితే బాగుంటుంది అని ముందుగానే ఫిక్స్ అవుతారు.. అలాగే కొంద‌రు ద‌ర్శ‌కులు త‌మ సినిమాకి బాణీలు వీరు ఇస్తే బాగుంటుంది అని కొంద‌రిని ఫిక్స్ చేసుకుంటారు .. అలాగే బోయ‌పాటి విష‌యంలో వినిపించే పేరు దేవిశ్రీప్రసాద్ .. అయితే ఆయ‌న‌కు ఎక్కువ‌గా సినిమాలు ఇవ్వ‌డానికి చూస్తాడు బోయ‌పాటి

బోయపాటి తీసిన జయజానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలకు డీఎస్పీనే మ్యూజిక్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు బోయపాటి. అవును బాల‌య్య సినిమాకి త‌మ‌న్ కి సంగీత బాధ్య‌త‌లు అప్ప‌గించాడు.

అయితే ఆయ‌న మ‌రింత కొత్త‌ధ‌నం కోరుకుంటున్నారా, లేదా దేవీకి బిజీ షెడ్యూల్ వ‌ల్ల త‌మ‌న్ కు ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది .. అయితే తమన్ తో సరైనోడు సినిమాకు వర్క్ చేశాడు బోయపాటి. ఆ సినిమా సాంగ్స్ హిట్ అయ్యాయి మ‌ళ్లీ అదే రిపీట్ చేయాల‌ని బోయ‌పాటి ప్లాన్ ఏమో చూడాలి.