బోయపాటి తర్వాత బాలయ్య సినిమా ఆయనతో ఫిక్స్

బోయపాటి తర్వాత బాలయ్య సినిమా ఆయనతో ఫిక్స్

0

నందమూరి బాలకృష్ణబోయ పాటితో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు, ఈ చిత్రంపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు.. ఇటీవల ఆయన చిత్రం రూలర్ అలరించినా సక్సెస్ అవ్వలేదు..దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో బాలయ్య ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాని కూడా ఒకే చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు తరువాత ఆయన బి.గోపాల్ తో ఒక సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన దగ్గరకు ఓ మంచి స్టోరీ లైన్ వచ్చిందట.. ఇది బాలయ్యకు కూడా బాగా నచ్చింది అని తెలుస్తోంది.
ఆ కథను బి.గోపాల్ అయితేనే సమర్థవంతంగా తెరకెక్కించగలడనే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ – బి. గోపాల్ మధ్య చర్చలు ఒకే అయితే .. బోయపాటి తరువాత బాలయ్య చేసే సినిమా ఇదే అవుతుందని అంటున్నారు టాలీవుడ్ పెద్దలు. గతంలో బాలకృష్ణ .. బి.గోపాల్ కాంబినేషన్లో రౌడీ ఇన్ స్పెక్టర్.. లారీ డ్రైవర్ .. సమరసింహా రెడ్డి .. నరసింహ నాయుడు ఇలా అద్బుతమైన చిత్రాలు వచ్చాయి.. సో చూడాలి బాలయ్య మరో కొత్త కథని ఫైనల్ చేయడం పై ప్రకటన ఎప్పుడు వస్తుందో.