విజువల్​ వండర్​గా​​ ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్​ (వీడియో)

0

రణ్​బీర్, అలియా,అమితాబ్, నాగార్జున, మౌనీరాయ్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్‌ ముఖర్జీ సుమారు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ విజువల్​ వండర్​గా తెరకెక్కిన బ్రహ్మస్త్ర సెప్టెంబరు 9 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

https://www.youtube.com/watch?time_continue=1&v=sWpm-RsRmWA&feature=emb_title

నీరు, గాలి, నిప్పు.. ఈ మూడు ప్రాచీన కాలం నుంచి మన మధ్య శక్తులుగా ఉంటూ అస్త్రాలలో దాగి ఉన్నాయంటూ..అస్త్రాలన్నింటికీ దేవతైన ‘బ్రహ్మాస్త్ర’ గురించే ఈ కథ. అలాగే ‘బ్రహ్మాస్త్ర’ విధి కనిపెట్టే ఓ యువకుడి కథ ఇది. అతడే శివ.” అంటూ బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ వాయిస్​ ఓవర్​తో ప్రారంభమైన ఈ చిత్ర ట్రైలర్​ ఆద్యంతం అదిరిపోయే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

ఇందులో మన టాలీవుడ్​ అగ్ర హీరో నాగార్జున ​శివుడి వాహనం నందిగా పవర్​ఫుల్​గా కనిపిస్తున్నారు. ‘హే నంది అస్త్రం’.. అంటూ నాగ్​.. ‘మన అందరీ లక్ష్యం ఒక్కటే.. బ్రహ్మాస్త్ర’ అంటూ మౌనీరాయ్​ ఓ శక్తిమంతమైన విలన్​గా.. “నువ్వు ఈ అస్త్రాలతో కలిశావు. ఎందుకంటే నువ్వే ఓ అస్త్రం. నిప్పు నీ గుణం” అంటూ రణ్​బీర్​తో బిగ్​బీ చెప్పే సంభాషణలు అదిరిపోయాయి. ఇక ఆలియాగాఇషా-శివగా రణ్​బీర్​ ప్రేమాయణం మెప్పించేలా సాగింది. చివరిగా ‘ది పవర్​ ఆఫ్ లవ్​, లైట్​, ఫైర్.. బ్రహ్మాస్త్ర’ అంటూ ప్రచార చిత్రం​ ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here