బ్రేకింగ్ లాక్ డౌన్ పొడిగిస్తే… మే నెలకారికి 4 కోట్ల మొబైల్ ఫోన్లు పాడవుతాయట..

బ్రేకింగ్ లాక్ డౌన్ పొడిగిస్తే... మే నెలకారికి 4 కోట్ల మొబైల్ ఫోన్లు పాడవుతాయట..

0

కరోనా వైరస్ ఏ ముహుర్తాన పుట్టిందో తెలియదు కానీ ఇప్పుడు దాని నృత్యానికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.. అగ్రరాజ్యం అయిన అమెరికా సైతం కోవిడ్ 19 కు వణికిపోతుంది… ఈ వైరస్ దాటికి అక్కడి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు…

ఇక మనదేశంలో దీన్ని అరికట్టేందుకు లాక్ డౌన్ కొనసాగిస్తోంది… దీంతో ప్రజలందరు ఇళ్లకే పరిమితం అయ్యారు… లాక్ డౌన్ మే 3వరకు కొనసాగుతుంది… ఆ తర్వాత కూడా లాక్ డౌన్ ఇలానే కొనసాగిస్తే నాలుగు కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు మాయం కానున్నాయని అంటున్నారు..

అవునండీ మీరు వింటున్నది నిజమే… హ్యాండ్ సెట్ లలో లోపాలు బ్రేక్ డౌన్ లవంటి కారణంగా అవి ఉపయోగపడకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు… ఇదే విషయాన్ని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ పేర్కొంది… మొబైల్ ఫోన్లు విడి భాగాలు అందుబాటులోకి లేకపోవడంవల్ల ఇప్పటికే దాదాపే 2.5 కోట్ల మంది ఫోన్లు నిరుపయోగంగా మారాయని అంచనా వేస్తున్నారు…