బ్రేకింగ్ న్యూస్ – కేంద్రం మ‌న దేశ డాక్ట‌ర్ల‌కు గుడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ - కేంద్రం మ‌న దేశ డాక్ట‌ర్ల‌కు గుడ్ న్యూస్

0

ఇప్పుడు ప్ర‌పంచం అంతా దేవుళ్ల‌ని కాదు డాక్ట‌ర్ల‌ని మొక్కుతున్నారు, ఈ క‌రోనా పై పోరులో వారే పెద్ద యోధులు అని చెప్పాలి, ఇక ఈ స‌మ‌యంలో కొంద‌రు డాక్ట‌ర్ల‌పై దాడి చేస్తున్నారు.. దీంతో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

కరోనా వైరస్‌ సేవల్లో ఉన్న వైద్యులు, సిబ్బందిపై దాడులు పెరుగుతుండటంతో వారికి రక్షణగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చింది, వారికి పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తాము అని తెలిపింది, తాజాగా ఆరోగ్య సిబ్బంది రక్షణకు కేంద్ర కేబినెట్‌ ఒక ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదముద్రతో అది అమలులోకి రానుంది.

ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరిపితే దాన్ని బెయిల్‌ లభించని నేరంగా పరిగణిస్తారు. ఆరు మాసాల నుంచి ఏడేళ్లపాటు జైలు శిక్ష ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు. ఇక ఎవ‌రైనా ఉద్దేశంగా వారిపై దాడి చేస్తే వెంట‌నే అరెస్ట్ చేసి ఈ కేసులు ఫైల్ చేస్తారు.
ఇక ఏనాటి నుంచో ఉన్న 120ఏళ్ల నాటి ఎపిడ‌మిక్ చ‌ట్టం స‌వ‌రించారు. అంతేకాదు ఇలా శిక్ష‌తో పాటు డాక్ట‌ర్ ఆరోగ్య సిబ్బంది పై దాడి చేస్తే వారిపై ల‌క్ష రూపాయ‌ల నుంచి 5 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తారు. వారి ర‌క్ష‌ణ‌కు బీమా కూడా అందిస్తారు.