కూల్చివేస్తామన్న ప్రజావేదికలోనే సమావేశం నిర్వహిస్తారా?: బుద్ధా వెంకన్న

కూల్చివేస్తామన్న ప్రజావేదికలోనే సమావేశం నిర్వహిస్తారా?: బుద్ధా వెంకన్న

0

ప్రజావేదికను కూలగొడతానని చెబుతున్న సీఎం జగన్, అక్కడే సమావేశం నిర్వహించడం కరెక్టు కాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు నిర్వహించే కలెక్టర్లతో సమావేశం పూర్తయిన తర్వాత ఈ వేదికను కూల్చేస్తామని జగన్ చెబుతున్నారని, ఇది కచ్చితంగా కక్షపూరిత చర్యేనని విమర్శించారు.

ప్రజావేదికను తమకు కేటాయించాలని చంద్రబాబునాయుడు కోరారని, అది కేటాయిండం ప్రభుత్వానికి ఇష్టం లేకనే కూల్చివేస్తున్నట్టు ప్రకటించిందని విమర్శించారు. ఆ వేదికను చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టం లేకపోతే దానిని మరోవిధంగా ప్రభుత్వం ఉపయోగించుకోవాలే తప్ప ప్రజా ధనాన్ని వృథా చేయకూడదని సూచించారు.