బన్నీ సినిమా టైటిల్ ఏమిటి చిత్ర యూనిట్ క్లారిటీ

బన్నీ సినిమా టైటిల్ ఏమిటి చిత్ర యూనిట్ క్లారిటీ

0

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే…. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు, ఇక ఈ సినిమాపై సుకుమార్ గత కొన్ని నెలలుగా వర్క్ చేస్తున్నారు.. అల వైకుంఠపురంలో చిత్రం పూర్తి అవ్వగానే తాజాగా ఈ సినిమాని స్టార్ట్ చేశారు బన్నీ, అయితే బన్నీ సరసన ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది

ఇప్పటికే కేరళలోని ఈ సినిమా షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేశారు, ఇక రెండో షెడ్యూల్ లో బన్నీ పాల్గొననున్నారు.
ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన స్టోరీ థీమ్ అనే వార్తలు రావడంతో ఈ సినిమా టైటిల్ పై ఓ వార్త వైరల్ అవుతోంది… అంతేకాదు శేషాచలం, రెడ్ శాండిల్ ఫైటర్ ఇలా అనేక టైటిల్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శక నిర్మాతలు స్పందించారు. తమ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదని చెప్పారు. ఫలానా టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. టైటిల్ ను ఖరారు చేసిన తరువాత తాము అధికారికంగా తెలియజేస్తామనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే శేషాచలం అనే టైటిల్ అల్లు అర్జున్ ఫోటోతో వైరల్ కావడంతో ఇదే టైటిల్ అని అందరూ భావించారు… కాని ఇది టైటిల్ కాదు అని తెలిపారు చిత్ర యూనిట్.