బన్నీ ఇంటికి తాకిన రాజధాని సెగలు

బన్నీ ఇంటికి తాకిన రాజధాని సెగలు

0

రాజధాని ఉద్యమ సెగలు రోజు రోజుకు ఎగసి పడుతున్నాయి.. ఈ సెగలు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలకు కూడా తగులుతున్నాయి… అమరావతి రాజధాని విషయంలో ఇండస్ట్రీకి చెందిన హీరోలు తమ అభిప్రాయాన్ని తెలపాలని డిమాండ్ చేస్తున్నారు…

నిన్న సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు నివాసాన్ని జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘాల నేతలు ముట్టడించారు… ఆయన ఇంటి ముందు నినాధాలు చేశారు… అమరావతికి మద్దతు ఇవ్వాలంటూ వారు నిరసనలు చేశారు…

తాజాగా మరో హీరో అల్లు అర్జున్ పై జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘాల నేతలు మండిపడ్డారు.. ఎక్కడో ఢిల్లీలోని జేఎన్యూ ఘటనపై స్పందించిన బన్నీ పక్కనే ఉన్న అమరావతి రైతుల ఆందోళనలపై ఎందుకు స్పందించకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ఈనెల 19 వరకు హీరోల ఇళ్లన్నీ ముట్టడిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే..