ఈ సినిమా హిట్ ఐదుగురికి లాభాలు తెచ్చింది బన్నీ క్లారిటీ

ఈ సినిమా హిట్ ఐదుగురికి లాభాలు తెచ్చింది బన్నీ క్లారిటీ

0

ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాణ సంస్ధ, బ్యానర్ ,అలాగే హీరో ,హీరోయిన్ , ప్రతినాయకుడు ఇలా చాలా మందికి మంచి ఫేమ్ వస్తుంది.. తాజాగా మారుతి దర్శకత్వంలో మెగా హీరో సాయితేజ్ నటించిన తాజా చిత్రం ప్రతిరోజూ పండగే, తొలిరోజు నుంచి వసూళ్లలో తనసత్తా చాటుతోంది.

పెద్ద ఎత్తున ఫ్యామిలీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. కుటుంబ బంధాలను ఫన్నీగా చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గీతా ఆర్ట్స్-2, యువీ సంస్థలు కలిసి ఈ సినిమా నిర్మించాయి, అంతేకాదు కలెక్షన్ల పరంగా సూపర్ గా దూసుకుపోతోంది.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. చిత్ర విజయం తనకెంతో ఆనందం కలిగించిందని ట్వీట్ చేశాడు. ప్రతిరోజూ పండగే చిత్రబృందం మొత్తానికి అభినందనలు. మా కజిన్ సాయితేజ్‌కు మంచి విజయం దక్కడం సంతోషంగా ఉంది. నా స్నేహితుడు మారుతి హిట్ అందుకున్నాడు, నా ప్రాణ మిత్రుడు వాసు మరో మంచి సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు, మా నాన్నకు బాగా లాభాలు వచ్చాయి. అలాగే తమన్ మరో మంచి ఆల్బమ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడని బన్నీ ట్వీట్ చేశాడు. సో బన్నీ ట్వీట్ చూసినా అదే తెలుస్తోంది, మొత్తానికి ఆయనకు సన్నిహితులు అందరూ ఈ సినిమాతో మంచి లాభాలు సంపాదించారు అని అంటున్నారు ఫ్యాన్స్ .