బన్నీ, మహేష్.. వీరిద్దరూ ఎందుకిలా చేస్తున్నారు..!!

బన్నీ, మహేష్.. వీరిద్దరూ ఎందుకిలా చేస్తున్నారు..!!

0

బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వైకుంఠపురంలో అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సంక్రాంతి కి ఈ సినిమా రిలీజ్ ఉంది.. మరో పక్క అదే సంక్రాంతి కి మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా ని కూడా రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన కొద్ది నిమిషాలకే మహేష్ బాబు కూడా తమ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.

మామూలు సీజన్లో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. కానీ ఈ రెండు సినిమాలను ఆదివారమే రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఎలా ఉంటుందో తెలిసిందే. అసలు ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ ఎందుకు అవుతున్నాయి. ఎవరు పంతానికి పోయారు అన్న దానిపై ఇండస్ట్రీలో రకరకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.