జనసేన పార్టీ కోసం పని చేస్తే సినిమా అవకాశాలు రావు , టాలెంట్ ఉంటే వస్తాయి : బన్నీ వాసు

జనసేన పార్టీ కోసం పని చేస్తే సినిమా అవకాశాలు రావు , టాలెంట్ ఉంటే వస్తాయి : బన్నీ వాసు

0

రెండు రోజుల క్రితం ఫిలిం చాంబర్ ఎదుట జూనియర్ ఆర్టిస్ట్ సునీత నిరసన తెలిపిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ వాడుకున్నారని ఆరోపించింది. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని చెప్పింది. ఇదే సమయంలో ఆమె నిర్మాత బన్నివాసు పైన విమర్శలు గుప్పించింది.

అల్లు అరవింద్ స్పందించాలని డిమాండ్ చేసింది ఈ విషయంపై బన్నీ వాసు ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ స్పందించాడు. జనసేన పార్టీలో కార్యకర్తగా పని చేసినంత మాత్రాన సినిమాల్లో అవకాశాలు రావని టాలెంట్ ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయని చెప్పారు.

సునీత దుందుడుకు స్వభావంతో ఎప్పటికప్పుడు తన వైఖరి మార్చుకుంటూ వెళ్లిందన్నారు కేవలం తాను అమ్మాయి నాన్న కారణంతోనే సానుభూతి లభిస్తుందని, దాంతోనే ఇటువంటి పనులు చేస్తోందని అన్నారు ఆత్మహత్య చేసుకుంటానని సునీత బెదిరింపులకు దిగింది అని ఆరోపించారు. సునీత విషయంలో నిర్మాత బన్నివాసు ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం.