బస్సుకోసం ఉద్యోగంలో చేరాడు బస్సులో ఏముందంటే

బస్సుకోసం ఉద్యోగంలో చేరాడు బస్సులో ఏముందంటే

0

కూటి కోసం కోటి విద్యలు అన్నారు, అయితే దొంగతనానికి కూడా దారులు వెతుక్కుంటున్నారు కొందరు. ఏకంగా ఓ వ్యక్తి బస్సుని దోచేసేందుకు ప్లాన్ వేశాడు, డ్రైవర్ ఉద్యోగంలో చేరి బస్సునే దోచేశాడు చివరకు పోలీసులకు చిక్కాడు

ఇది హైదరాబాద్ లో జరిగింది . సూర్యాపేటలోని కేటీ అన్నారానికి చెందిన నిమ్మల యాదగిరి నకిరేకల్‌లో ఉంటున్నాడు
యాదిగిరి డ్రైవర్‌గా పనిచేసేవాడు తనకు వచ్చే జీతం చాలక దొంగతనాలకు పాల్పడుతున్నాడు.. 2013లో సిమెంటు బస్తాల లోడుతో ఉన్న లారీని చోరీ చేసిన కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినా తన వక్ర బుద్దీ మారలేదు.

మళ్లీ దొంగతనాలు చేసేవాడు బాలపూర్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు దగ్గర డ్రైవర్‌గా చేరాడు. అతడు కొనుగోలు చేసిన కొత్త భారత్ బెంజ్ బస్సు డ్రైవింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఆ బస్సుని ఓ చోట పార్క్ చేసి తాళాలు కుమారుడకి ఇవ్వమని యజమాని చెప్పాడు కాని దుర్బుద్దితో బస్సుని శ్రీ శైలం పోనిచ్చాడు. చివరకు యజమానికి డౌట్ రావడంతో పోలీసులు అతనిని గుర్తించి బస్ ని, అతనిని అదుపులోకి తీసుకున్నారు.