సెకండ్ హ్యాండ్​లో ల్యాప్​టాప్ కొంటున్నారా? అయితే వీటిని చెక్ చేసుకోండి

0

కొన్ని సార్లు ఫోన్ అయినా ల్యాప్ టాప్ అయిన సెకండ్ హ్యాండ్ వాడడం తప్పదు. కొత్తవాటితో పోలిస్తే తక్కువ ధరకు వస్తుండటంతో సెకండ్ హ్యాండ్​కు ప్రాధాన్యం ఇస్తుంటాం.  కొత్త ల్యాప్​టాప్​లు అంటే వాటి ఫీచర్లు, లుక్ చూస్తే సరిపోతుంది. కానీ సెకండ్ హ్యాండ్ విషయంలో అది సరిపోదు. ఫీచర్లతో పాటు వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి.

ర్యామ్ టెస్ట్

పీసీ లేదా ల్యాప్​టాప్ కొనేటప్పుడు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ లేదా ర్యామ్​ను చెక్ చేయాలి. ర్యామ్​లో లోపాలు ఉంటే కంప్యూటర్ క్రాష్ అవుతుంటుంది. గ్రాఫిక్స్ సరిగా లోడ్ అవ్వవు. పర్ఫార్మెన్స్ నెమ్మదిస్తుంది. ఎర్రర్​లకు లెక్కే ఉండదు. ర్యామ్ టెస్ట్ చేసేందుకు థర్డ్ పార్టీ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, విండోస్ మెమొరీ డయాగ్నోస్టిక్ టూల్​ను ఉపయోగించడమే బెటర్.

హార్డ్ డ్రైవ్​ చెక్

పాత పీసీలు, ల్యాప్​టాప్​ల హార్డ్ డ్రైవ్​లు బాగున్నాయా లేదా అన్న విషయాన్ని చూసుకోవాలి. హార్డ్ డ్రైవ్​లు చెడిపోతే.. డ్రైవ్​ల నుంచి ట్రాన్స్​ఫర్ అయ్యే సమాచారాన్ని కంప్యూటర్ సరిగా గుర్తించదు. ఫైల్ లోడింగ్ ఆలస్యం అవుతుంది. కంప్యూటర్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

బ్యాటరీ హెల్త్

పీసీలు నేరుగా విద్యుత్​తో పనిచేస్తాయి. కానీ, ల్యాప్​టాప్​లకు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ అవసరం. వీటి బ్యాటరీ సామర్థ్యం వాడుతున్నాకొద్దీ తగ్గిపోతుంది. బ్యాటరీ కొంచెం పాడైనా.. వెంటనే రీప్లేస్ చేయించాల్సి ఉంటుంది. అందువల్ల ముందే బ్యాటరీ హెల్త్​ను చెక్ చేయాలి.

సీపీయూ, జీపీయూ స్ట్రెస్ టెస్టింగ్

ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడటం, హై ఎండ్ టెక్నికల్ వర్క్స్ కోసం సెకండ్ హ్యాండ్ పీసీ కొనాలని అనుకుంటే సీపీయూ, జీపీయూను తనిఖీ చేయడం చాలా అవసరం. పీసీ సీపీయూ ఎంత మేరకు ఒత్తిడి తట్టుకుంటుందో చెక్ చేసుకోవాలి. ఇందుకు స్ట్రెస్ టెస్టింగ్ నిర్వహించాలి. దీని ద్వారా కంప్యూటర్ హార్డ్ వేర్(సీపీయూ, జీపీయూ) పర్ఫార్మెన్స్​ను గరిష్ఠ స్థాయిలో పరీక్షించవచ్చు. ఎక్కువ లోడ్​ను కంప్యూటర్ ఏమేరకు హ్యాండిల్ చేస్తుందో తెలుసుకోవచ్చు. స్ట్రెస్ టెస్ట్​ను పీసీ తట్టుకుంటే బాగా పనిచేసినట్టే. లేదంటే మధ్యలోనే క్రాష్ అయిపోతుంది.

సీపీయూ, జీపీయూ టెంపరేచర్​ చెకింగ్

స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో కంప్యూటర్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు పీసీ దాని గరిష్ఠ పర్ఫార్మెన్స్ ఇచ్చేలోపే.. టెంపరేచర్ ఎక్కువై క్రాష్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు పీసీ/ల్యాపీకి అదనపు కేస్ ఫ్యాన్ అవసరమవుతాయా అని చూసుకోవాలి. లేదా కూలింగ్ కిట్ అమర్చుకోవాలి.
NZXT’s CAM సాఫ్ట్​వేర్ సాయంతో ఫ్యాన్ స్పీడ్​ను నియంత్రించుకోవచ్చు. తద్వారా పీసీ టెంపరేచర్​ను తగ్గించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here