బీజేపీలో చేరుతున్నా… టీడీపీ నేత ప్రకటన

బీజేపీలో చేరుతున్నా... టీడీపీ నేత ప్రకటన

0

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లనుకూడా సిద్దం చేసుకున్నారు… ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇక ఆ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే కర్నూల్ జిల్లా నందికొట్కూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు… ఈమేరకు ఆయన మీడియాతో కూడా తెలిపారు… తాను కార్యకర్తల అభిమానుల కోరిక మేరకే బీజేపీలో చేరుతున్నానని తెలిపారు…

ఏపీ అభివృద్ది చెందాలంటే బీజేపీతో సాధ్యం అవుతుందని అన్నారు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ల వల్లే రాష్ట్రం విడిపోయిందని అన్నారు… వైసీపీ హైరోర్టు ప్రస్థావన తీసుకువచ్చి రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని బైరెడ్డి మండిపడ్డారు…