కారు బ్యాక్ సీటుపై ఉన్నది చూసి ప‌రుగులెత్తిన ఇంజ‌నీర్

కారు బ్యాక్ సీటుపై ఉన్నది చూసి ప‌రుగులెత్తిన ఇంజ‌నీర్

0

అత‌ను ఓ ఇంజ‌నీర్ అతి పెద్ద కారు వాడుతున్నాడు, ఇక ల‌గ్జ‌రీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఇక ఈ క‌రోనా వేళ ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు, దీంతో గ‌త నెల‌లో తెచ్చిన కిరాణా అయిపోవ‌డంతో త‌నొక్క‌డే సూప‌ర్ మార్కెట్ కు వెళ‌దాం అని అనుకున్నాడు, ఈ లోగా 3 వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న త‌న కుమారుడు కూడా మారాం చేశాడు.

అత‌ను కూడా కారులో వ‌స్తాను అన్నాడు ….అయితే కుమారుడ్ని వెనక కూర్చోమ‌ని డోర్ ఓపెన్ చేశాడు, అయితే ఒక్క‌సారిగా కారు సీటుపై పెద్ద నాగుపాము ప‌గ‌డ‌విప్పి బుస‌కొడుతోంది, వెంట‌నే డోర్ తీసి అలా ఉంచి భ‌యంతో ఇంట్లోకి వెళ్లిపోయారు.. త‌ర్వాత భార్య మిగిలిన చుట్టుప‌క్క‌ల వారు వ‌చ్చేస‌రికి అది నెమ్మ‌దిగా కింద‌కి దిగి ప‌క్క‌న ఉన్న స్ధ‌లాల్లోకి వెళ్లిపోయింది.

అయితే దాదాపు వారం రోజులుగా అత‌ను కారు తీయ‌లేదు. అస‌లు కారులోకి ఎలా పాము వ‌చ్చింది అనేది అర్దం కావ‌డం లేదు అంటున్నాడు, మొత్తానికి ఆ పాము మాత్రం 10 అడుగులు ఉంది.. ఏమాత్రం పిల్ల‌వాడు కంగారుగా లోప‌ల కూర్చున్నా అది కాటువేసేది అని భ‌య‌ప‌డ్డారు ఆ త‌ల్లిండ్రులు.