గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు సంస్థలోని మరో ఐదుగురిపై కోర్టు ఆదేశాల మేరకు ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏక్ హసీనా తి ఏక్ దివానా థా’ సినిమాను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులను గూగుల్ అనుమతించిందని కోర్టును ఆశ్రయించారు. ప్రముఖ దర్శకుడు సునీల్ దర్శన్. ఆయన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.