బాలయ్యతో నటిస్తా కాని రెమ్యునరేషన్ ఇంత కావాలి

బాలయ్యతో నటిస్తా కాని రెమ్యునరేషన్ ఇంత కావాలి

0

బాలయ్యతో సినిమా అంటే చాలా మంది హీరోయిన్స్ రెడీ అంటారు… తాజాగా టాప్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకున్న కేథరిన్ మరోసారి తెలుగులో అలరించనుంది అని తెలుస్తోంది.. ఆమెకు సరైనోడు నేనే రాజు నేనే మంత్రి సినిమాలు సూపర్ హిట్ తెచ్చాయి., ఇక తాజాగా విజయ్ దేవరకొండ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా నటిస్తోంది.

తాజాగా ఈ మత్తుకళ్ల సుందరి బాలయ్య తో నటిస్తుంది అని తెలుస్తోంది …తాజాగా బోయపాటి టీమ్ ఆమెను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె ఎంపిక జరిగిపోయిందని కూడా చెప్పుకున్నారు. అయితే ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందట,అందుకే ఆమెని ఫిక్స్ చేయలేదు అని అంటున్నారు.

కేథరిన్ పారితోషికం ఎక్కువగా అడిగిందట గత సినిమాల కంటే దాదాపు డబుల్ రెమ్యునరేషన్ అయింది అని అంటున్నారు. అందువలన ఆమెను పక్కన పెట్టేసి మరో కథానాయిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఫిబ్రవరి 3వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక ఇందులో శ్రీకాంత్ కూడా ప్రతినాయకుడిగా కనిపించనున్నారట,