ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన

Center official statement on grain procurement

0

తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. యాసంగి సీజన్ మొదలయ్యాకే టార్గెట్ నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సిందిగా ఆగస్ట్ 17న రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొంది.

పెరిగిన దిగుబడి అంచనాలు, మార్కెట్లో మిగులు, పెరిగిన సాగును దృష్టిలో పెట్టుకుని సేకరణ మరింత పెంచాలని చూస్తున్నట్లు వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వర రావు, మాలోత్ కవిత, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానమిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here