గోపీచంద్ సినిమా ట్రైలర్.. హిట్ కొట్టేలా ..!!

గోపీచంద్ సినిమా ట్రైలర్.. హిట్ కొట్టేలా ..!!

0

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘చాణక్య’. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది.. దసరా కానుకగా చాణక్య అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. కాగా ఈ చిత్ర ట్రైలర్ నేడు రిలీజ్ చేసింది..

కాగా ఈ ట్రైలర్ యాక్షన్ తో కూడుకుని ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంది.. ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక దసరా కానుకగా సైరా సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ముందు చాణక్య ఏ మేరకు నిలబడతాడు అనేది చూడాలి.