క్యా ప్లాన్ హై చంద్రబాబు జీ … ఒకే దెబ్బకు రెండు పిట్టలు

క్యా ప్లాన్ హై చంద్రబాబు జీ ... ఒకే దెబ్బకు రెండు పిట్టలు

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవానికి పదును పెట్టడంతో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీలు అంతర్ మధనంలో పడ్డాయి.. చలో ఆత్మకూరు అని చెప్పి చంద్రబాబు నాయుడు వైసీపీపై దాడిని ముమ్మరం చేశారు.

కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న చంద్రబాబు నాయుడు మొదటి అడుగులోనే సక్సెస్ అయ్యారు. చలో ఆత్మకూరు నినాదంతో రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న తమ్ముళ్లు యాక్ట్ అయ్యారు. దీంతో చంద్రబాబు ఎంతోకొంత సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

చలో ఆత్మకూరు నినాదంతో టీడీపీ వైసీపీని టార్గెట్ చేశారని బయటకు కనిపిస్తున్నా లోపలు మాత్రం బీజేపీకి కూడా చెక్ పెట్టారు. ప్రస్తుతం పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో వైసీపీపై యుద్దం చేస్తే మళ్లీ టీడీపీ యాక్టివ్ అవ్వడమే కాకుండా బీజేపీలోకి వెళ్ళే నాయకులు కూడా పుణరాలోచన చేస్తారని అంటున్నారు.