చంద్రబాబు ఆ దేశం వెళతారా వెళ్లరా

చంద్రబాబు ఆ దేశం వెళతారా వెళ్లరా

0

స్విట్జర్లాండ్ పేరు చెప్పగానే ముందు వినిపించే పేరు రాజధాని దావోస్….అయితే ప్రతీ ఏడాది అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు గురించి మనకు తెలిసిందే.. తెలుగుదేశం నేతలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ నారాలోకేష్ కూడా అక్కడకు వెళ్లి హజరయ్యేవారు, ఒకవేళ ఎవరైనా ఇక్కడకు వెళ్లాలి అంటే దావోస్ లో సమావేశానికి భారీ ధర చెల్లించి టికెట్ కొనుక్కోవాలి. అలా చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ముతో దావోస్ సమావేశానికి టికెట్ కొని, ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానంలో వెళ్లి వచ్చే వారు.

అయితే తాజాగా మరి ఈ ఏడాది చంద్రబాబు సీఎంగా లేరు, అలాగే లోకేష్ కూడా మంత్రిగా లేరు, మరి ఈ సమయంలో చంద్రబాబు అలాగే తెలుగుదేశం నేతలు కూడా దావోస్ అనే పేరు పలకడం లేదు.

అయితే ఈ ఏడాది అలా కోట్లు ఖర్చు పెట్టి దావోస్ వెళ్లే ఆలోచనలో తెలుగుదేశం నేతలు లేరు అని అంటున్నారు.. వైసీపీ నేతలు కూడా దావోస్ వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదట. అయితే చంద్రబాబు మరోసారి అక్కడకు వెళ్లాలి అంటే కచ్చితంగా విమానం టికెట్ కొనుక్కోని వెళ్లాల్సిందే, ప్రభుత్వం దీనికి నగదు ఇచ్చే అవకాశం ఉండదు. దీంతో టీడీపీ దావోస్ ఆలోచన పక్కన పెట్టేసింది అంటున్నారు నేతలు.