రాజశేఖర్ రెడ్డిని ఈ విషయంలో మనస్పూర్తిగా మెచ్చుకున్న చంద్రబాబు

రాజశేఖర్ రెడ్డిని ఈ విషయంలో మనస్పూర్తిగా మెచ్చుకున్న చంద్రబాబు

0

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్పూర్తిగా మెచ్చుకున్నారు… గతంలో వైఎస్ పత్రికా స్వేచ్చను హరించేలా జీవోను తెచ్చారని గుర్తు చేశారు… వైఎస్ విజ్ఞతతో కూడిన నేత అని కానీ ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అహంభావి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

పత్రికా శ్వేచ్చకోసం వైఎస్ జీవోను రద్దు చేస్తే జగన్ ఈ జీవోను మళ్లీ తీసుకువస్తున్నారని మండిపడ్డారు… రానున్న రోజుల్లో ఈ జీవో పరిణామాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు… ప్రస్తుతం టీడీపీ నాయకులు ఆర్థికంగా దెబ్బతీసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు…

ఖజానాలో చిల్లి గవ్వలేకున్నా కూడా ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారని ఆరోపించారు… తెలుగుదేశం పార్టీ పాలనలో అవినీతి మాయం అంటున్న అధికారులు ఐదునెలల కాలంలో ఒక్క హామీను అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు చంద్రబాబు..