అన్నింటికీ ప్రభుత్వానిదే బాధ్యత : చంద్రబాబు

అన్నింటికీ ప్రభుత్వానిదే బాధ్యత : చంద్రబాబు

0

ఏపీలో లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల పై పెట్టిన కేసులు అన్నింటినీ ఎత్తివేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన కార్యకర్తల ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే నన్నారు పల్నాడు లో జరుగుతున్న అన్ని దుర్మార్గులకు ప్రభుత్వానిదే బాధ్యత అని, బాధితులకు న్యాయం జరిగేంత వరకు తను వదిలిపెట్టమాని హెచ్చరించారు.

ఈ మేరకు బాబు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెడుతూ.. “అధికారులు ఓవైపు గుంటూరు శిబిరంలో చర్చలు చేస్తూ, మరోవైపు గురజాల డివిజన్లో 144 సెక్షన్ విధించారు. ఇది రాజకీయ శాంతిభద్రతల సమస్య పండుగల శాంతిభద్రతల అంశం కాదు. ఇది రాష్ట్ర సమస్య కానీ కేవలం పన్నాడు సమస్య కాదు. బాధితులకు న్యాయం చేయాలన్నదే టిడిపి సంకల్పం అన్నారు.

ఇంతకు ముందు తప్పుడు కేసులు అన్నింటిని ఎత్తివేయాలి. ధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలి. 110 రోజులుగా గ్రామాల నుంచి వెళ్లగొట్టారు. వందలాది కుటుంబాల జీవనోపాధి పోగొట్టారు. వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు” ఆని చంద్రబాబు ట్వీట్ చేశారు.