వంశీ రాజీనామాపై చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు…

వంశీ రాజీనామాపై చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు...

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకు వాట్సప్ ద్వారా పంపారు… ఆయన రాజీనామాతో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు…

కానీ ఆయన మాత్రం తన రాజీనామా విషయంలో తగ్గేదిలేదని అంటున్నారు… ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు… వైసీపీ నాయకులు మరియు మరికొంతమంది ప్రభుత్వ అధికారుల వల్ల పార్టీకి రాజీనమా చేయడం సరికాదని అన్నారు…

ప్రజల ప్రయోజనాలకోసం తిరిగి పోరాడాలని చంద్రబాబు సూచించారు… మీపై పెట్టిన కేసు దురుద్దేశం అని అన్నారు చంద్రబాబు నాయుడు… అర్హతగల ప్రజలకు వారి ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించడం తప్పేమిలేదని అన్నారు…