చంద్రబాబు ఎఫెక్ట్ నిజం ఒప్పుకున్న వైసీపీ

చంద్రబాబు ఎఫెక్ట్ నిజం ఒప్పుకున్న వైసీపీ

0

గతంలో తాము ఎన్నడు విద్యుత్ కోతలు పెట్టలేదని ప్రస్తుత ప్రభుత్వం పెట్టిందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు… తక్షనమే ప్రభుత్వం ప్రజలకు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై వైసీపీ సర్కార్ స్పందించింది… ఏపీలో విద్యుత్ కోతలు ఉన్నమాట వాస్తవమే అని తెలిపింది. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉన్నాయని రానున్న మరికొద్దిరోజుల్లో వాటిని సరిచేస్తామని స్పష్టం చేశారు…

విద్యుత్ పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో అలాగే పక్కరాష్ట్రాలతో చర్చలు జరుపుతామని బొత్స తెలిపారు… అంతేకాదు చంద్రబాబుపై అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై కూడా ఆయన నిప్పులు చేరిగారు…