టీడీపీకే ఛాన్స్…. రంగంలోకి చంద్రబాబు

టీడీపీకే ఛాన్స్.... రంగంలోకి చంద్రబాబు

0

కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కానున్నారు. ఇప్పటికే ఏపీలో చలో ఆత్మకూరు అనేనినాదాన్ని సక్సెస్ చేశారు.

ఇదే క్రమంలో తెలంగాణలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ (ఆత్మగౌరవం) అనే మంత్రాన్నిఅందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 14 న ఆత్మీయ సమావేశం పేరిట ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఓ సమావేశం నిర్హహించనున్నారని సమాచారం.

ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం పార్టీని వదిలి వెళ్లిన వారిని తిరిగి టీడీపీలో చేర్చుకోవడం అన్నమాట. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ లో అసంత్రుప్తి సెగతలని క్యాష్ చేసుకోవాలని స్తాన్ వేస్తున్నారట.