చంద్రబాబుకు షాక్ జగన్ కు టచ్ లో కీలక టీడీపీ నేతలు

చంద్రబాబుకు షాక్ జగన్ కు టచ్ లో కీలక టీడీపీ నేతలు

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే బీజేపీకి టచ్ లో వైసీపీ ఎంపీలు ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించారు….

సుజనా నువ్వు టీడీపీలో ఉన్నావా లేక బీజేపీలో ఉన్నావా అని ప్రశ్నించారు… బీజేపీకి వైసీపీ ఎంపీలు ఎవరు టచ్ లో ఉన్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు…… గూగుల్ లో సుజనా చౌదరి అని సర్చ్ చేస్తే బ్యాంకుకు దొంగగానే వస్తుందని అన్నారు…

కేవలం తన కేసుల మాఫీ కోసమే ఆయన పార్లమెంటుకు వస్తున్నారని వైసీపీ ఎంపీలు ఆరోపించారు… బ్యాంకులకు సుమారు ఆరువేల కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ నేతలు కలిసేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు… మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తే టీడీపీ బతికి బట్టకట్టలేదని హెచ్చరించారు వైసీపీ ఎంపీలు…