చంద్రబాబుకు షాక్ యామిని బాటలోనే మరో ఇద్దరు

చంద్రబాబుకు షాక్ యామిని బాటలోనే మరో ఇద్దరు

0

కొద్దిరోజుల క్రితం టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిన శర్మ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… ఆమె నిన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీ తీర్థం తీసుకుంది… తాజాగా కడప జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గజేంద్ర సింగ్ పాల్గొన్నారు…

ఆ కార్యక్రమంలో ఆమె బీజేపీ తీర్థం తీసుకుంది.. టీడీపీలో అంతర్గత విభేదాలు, కొన్ని ఇబ్బందుల వలన ఆమె టీడీపీకి రాజీనామా చేశానని గతంలో చెప్పింది యామిని… కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు దేశం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు అలాగే ఇతర బలమైన కారణాలవల్ల తాను రాజీనామా చేశానని తెలిపిన యామిని తాజాగా బీజేపీ తీర్థం తీసుకున్నారు…

ఇక ఆమె తర్వాత మరో ఇద్దురు కీలక టీడీపీ నేతలు కూడా బీజేపీ తీర్థం తీసుకోవాలని చూస్తున్నారట… కోస్తా జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత రాయలసీమకు చెందిన మరో టీడీపీ నేత త్వరలో కేంద్రమంత్రి సమక్షంలో బీజేపీలో చేరాలని చూస్తున్నారట…