అసలు చంద్రబాబు అక్కడకు ఎందుకు వచ్చారు సంచలన నిజం

అసలు చంద్రబాబు అక్కడకు ఎందుకు వచ్చారు సంచలన నిజం

0

నిన్న శాసన మండలిలో జరిగిన రాద్దాంతం తెలిసిందే.. అయితే వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య ఎలాంటి సంఘటన జరిగింది అసలు మండలిలో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియలేదు.. ఓ పక్క లైవ్ అంతా శాసన సభ నుంచి వస్తోంది.. కాని శాసన మండలి నుంచి రావడం లేదు. దీంతో చాలా మంది ప్రజలు కూడా ఏం జరుగుతుందా అని ఆలోచించారు.

అయితే వాస్తవానికి జరిగింది ఏమిటి అంటే మండలిలో ప్రత్యక్ష ప్రసారాన్ని మధ్యాహ్నం తర్వాత నిలిపివేశారు. దీంతో అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. చివరికి… చంద్రబాబు చాంబర్లోనూ ప్రసారం నిలిచిపోయింది. అయితే సీఎం ప్రతిపక్షనేత ఇలా చాంబర్లలో ప్రత్యక్ష ప్రసారాలు వస్తాయి మొత్తం అంతా నిలిచిపోయింది.

దీంతో వెంటనే చంద్రబాబు తన పార్టీ నాయకులతో కలిసి నేరుగా మండలి సందర్శకుల గ్యాలరీకి వచ్చి కూర్చున్నారు. అప్పటికే మరో గ్యాలరీలో విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్ద సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గందరగోళం మధ్య మండలి వాయిదా పడిన తర్వాత కూడా ఆయన అక్కడే ఉన్నారు. అలా ఆయన లైవ్ రాకపోవడం అలాగే వైసీపీ చేస్తున్న రాజకీయాలు కనిపించకపోవడం ఏమిటి అని నేరుగా గ్యాలరీకి వచ్చారు.