ఇక నుంచి చంద్రబాబు వద్ద వారు అస్సలు కనిపించరు…

ఇక నుంచి చంద్రబాబు వద్ద వారు అస్సలు కనిపించరు...

0

మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వరుస షాక్ లు తగులుతున్నాయి… 20 సంవత్సరాల వరకు ఏపీలో పార్టీ పుంజుకోదనే ఉద్దేశంతో తమ్ముళ్లు ఇతరపార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…

ఇప్పటికే చాలామంది నేతలు జంప్ చేసిన సంగతి తెలిసిందే… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే ఈ క్రమంలో కేంద్రం కూడా బిగ్ షాక్ ఇచ్చింది… వీఐపీలకు రక్ష ణ కల్పించే బ్లాక్ క్యాట్ భద్రత ఉపసంహరించాలాని నిర్ణయం తీసుకుంది…

చంద్రబాబు నాయుడుతో సహా మాయావతి, అస్సా సీఎం శర్వానంద సోనేవల్, ఫరూక్ అబ్దుల్లా, ఎల్ కే అద్వానీ, ప్రకాష్ సింగ్ బాదల్, వంటి తదితర 13 మందికి బ్లాక్ క్యాట్ కమాండోస్ ను తొలగించి వారి స్థానంలో సీఆర్పీఎఫ్ భద్రత వ్యవస్థను కొనసాగించనున్నారు…