ఏపీలో చంద్రబాబు పేరు తొలగించిన సర్కార్

ఏపీలో చంద్రబాబు పేరు తొలగించిన సర్కార్

0

హోరా హోరీగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గతంలో ఎన్నడూ లేనంత అబివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజలనుంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది… ఇక అదే స్పీడ్ ను మెంటేన్ చేస్తూ నవరత్నాల్లో ఉన్న ఒక రత్నానికి పేరు ప్రకటించారు…

గత ప్రభుత్వం లో అమలు అయిన చంద్రన్న పెళ్లికానుక పేరు తొలగించి దాని స్థానంలో వైయస్సార్ పెళ్లి కానుక’గా మార్చారు. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది…

కాగా ఇప్పటికే ఏపీ సర్కార్ మధ్యాహ్న భోజన పథకానికి అన్న క్యాంటీన్ గా ఉన్న పేరును వైయస్సార్ అక్షయపాత్రగా, అలాగే ఎన్టీఆర్ భరోసా పథకాన్ని వైయస్సార్ పింఛను కానుకగా మార్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు చంద్రన్న పెళ్లికానుక ను వైయస్సార్ పెళ్లి కానుక’గా మార్చారు.