భారీ ప్లాన్ తో కీలక నేతను టీడీపీలో చేర్చుకుంటున్న చినబాబు పెదబాబు

భారీ ప్లాన్ తో కీలక నేతను టీడీపీలో చేర్చుకుంటున్న చినబాబు పెదబాబు

0

ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అంత యాక్టివ్ గా లేదు….ఈ సారి అధికారం కోల్పోవడంతో కొంతమంది తమ్ముళ్లు ఎవరిదారి వారు చూసుకుంటుంటే మరికొందరు పార్టీకి అంటిముట్టనట్లు ఉన్నారు… ఇక వీటన్నింటిని ఘమనించిన చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల్లో పార్టీని యాక్టీవ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయన కుమారుడు లోకేశ్ కూడా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే లోకేశ్ తన ప్రెండ్ ను పార్టీలో చేర్పించుకునేందుకు రంగం సిద్ద చేసుకున్నారట. లోకేశ్ ప్రెండ్ అభిష్ట టీడీపీ నేతలకు మాత్రమే తెలిసిన నేత.

2014 ఎన్నికలకు ముందు అభిష్ట తెర వెనుక రాజకీయ చేసే తమ్ముళ్లలో ఉత్సాహాన్ని నింపారు. ఇక 2014లో పార్టీ అధికారంలోకి రావడంతో ఆ తర్వాత నుంచి పార్టీకి దూరమయ్యారు అభిష్ట ఇప్పుడు పార్టీ మరోసారి ప్రతిపక్షంలో చేరడంతో ఆయన్న పార్టీలో యాక్టీవ్ చేయాలని లోకేశ్ భావిస్తున్నారట. ఇందుకు చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.