కేంద్రం కీలక నిర్ణయం చంద్రబాబు కి ఎన్ఎస్జీ భద్రత తొలగింపు కారణం ఇదే

కేంద్రం కీలక నిర్ణయం చంద్రబాబు కి ఎన్ఎస్జీ భద్రత తొలగింపు కారణం ఇదే

0

మన దేశంలో బీజేపీ అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది….ఇప్పటికే చాలా వరకూ రక్షణ చర్యలు తీసుకోవడంలో కీలక ఆదేశాలు ఇస్తోంది కేంద్రం,, ఖర్చు తగ్గించే విషయంలో కూడా పొదుపు మంత్రం జపిస్తోంది..తాజాగా చాలా వరకూ ప్రముఖులకు కలిపిస్తున్న సెక్యూరిటీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ రక్షణ వలయంలా కనిపించే బ్లాక్ క్యాట్ కమాండోలను తొలగించింది. చంద్రబాబు సహా దేశం మొత్తం మీద 13 మంది ప్రముఖులకు కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రతను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది.ఇకపై వీరందరి సెక్యూరిటీని పారా మిలిటరీ దళాలు చూస్తాయని స్పష్టం చేసింది.

ఇప్పటికే మోదీ సర్కారు 2019 నుంచి 350 మంది వీఐపీలకు భద్రత తగ్గించింది. సోనియా గాంధీ ఫ్యామిలీ, మన్మోహన్ సింగ్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. చాలా మంది ప్రముఖులకి ఒక్కొక్కరికీ 25 మంది బ్లాక్ క్యాట్ కమాండోల చొప్పున భద్రతను కేంద్రం కల్పిస్తోంది వీరిని తాజాగా తొలగించింది, ఈ వీఐపీల జాబితాలో చంద్రబాబుతో పాటు రాజ్ నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, శర్వానంద సోనోవాల్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ఎల్కే అద్వానీ, ప్రకాశ్ సింగ్ బాదల్ ఉన్నారు.