చంద్రబాబుపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

0

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీడ రాష్ట్రానికి విరగడయ్యే నాటికి ఖజానాలో 100 కోట్లే మిగిలాయని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి… కరోనా వల్ల రాబడి పూర్తిగా తగ్గిందని అన్నారు… వచ్చే 2-3 నెలలు ఇలాగే ఉండొచ్చని అన్నారు. లాక్ డౌన్ లో ఎవరూ ఇబ్బంది పడకూడదని సిఎం జగన్ మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు ఇచ్చిన హామీలు నెరవేస్తున్నారని. అయినా పచ్చ మాఫియా ఏడుస్తూనే ఉందని ఆరోపించారు…

దేశంలోనే ప్రతి రోజూ అత్యధిక కోవిడ్ వైరస్ పరీక్షలు జరుపుతున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానానికి ఎగబాకిందని అన్నారు. ఇప్పుడున్న టెస్టింగ్ ల్యాబ్ లకు తోడు మిగిలిన జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని సిఎం జగన్ ఆదేశించారని తెలిపారు విజయసాయిరెడ్డి. ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి లభించిందని ఇవి అసాధారణ విజయాలివి అని అన్నారు..

ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నిటిలో ప్రతిపక్ష పార్టీలున్నాయని కరోనా కష్ట కాలంలో ఎక్కడా ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరించవని అన్నారు. ప్రజలు పోతే పోయారు గాని ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని అనుకోవడం లేదని కానీ ఒక్క ఏపిలో మాత్రం పచ్చ పార్టీ, ఎల్లో మీడియా అలా కోరుకుంటున్నాయని విజయాసాయిరెడ్డి ఆరోపించారు…