హైకోర్టులో చంద్రబాబు పిటిషన్.. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా

హైకోర్టులో చంద్రబాబు పిటిషన్.. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా

0

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు తనకు భద్రత కుదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. ఇరుపక్షాలు తమ వాదనలను న్యాయస్థానం ముందు ఉంచాయి. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చంద్రబాబు భద్రత కుదింపుపై పున:సమీక్షించాలని కోరారు. నిబంధనల కంటే చంద్రబాబుకు ఎక్కువ భద్రతే కల్పించారని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.