చిక్కుల్లో చంద్రబాబు…

చిక్కుల్లో చంద్రబాబు...

0

దొంగే దొంగ అని అరవడం చంద్రబాబు నాయుడుకు 40 ఏళ్లుగా అలవాటే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో తిట్టించింది ఆయనే అని మండిపడ్డారు.

ఇవ్వాళ తనే బాధితుడినన్నట్టు కుల మీడియాలో శోకాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.. తన వరకు వస్తే బాధేమిటే తెలియలేదు సారుకి అని అన్నారు. 1982 నుంచి లేనిది ఉన్నట్టు రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబు కు భయం పట్టుకుందని అన్నారు.

అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నారు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చి పోరని అన్నారు.