నేడు జగన్ సర్కార్ పై ఎటాక్ చేసేందుకు సిద్దమైన చంద్రబాబు

నేడు జగన్ సర్కార్ పై ఎటాక్ చేసేందుకు సిద్దమైన చంద్రబాబు

0

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎటాక్ చేసేందుకు సిద్దమయ్యారు… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఆద్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ధర్నాలు, నిరసనలు చేయనున్నారు…

ఈ మేరకు చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులకు టెలికాన్ఫరెన్స్ కాల్ చేసి సమాచారం అంధించారు… భవణ నిర్మాణ కార్మికులకు మద్దతుగా నిలుస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేయనున్నారు… వైసీపీ హయాంలో ఇసుక కొరత వల్ల లక్షలాది మంది భవణ నిర్మాణ కార్మికులు ఉపాది కోల్పోతున్నారని ఆగ్రహం చెందారు…

అందుకే వారికి మద్దతుగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు… రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చెప్పట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు…