చంద్రబాబు సవాల్ రా చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం

చంద్రబాబు సవాల్ రా చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం

0

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ సర్కారుని తీవ్రస్ధాయిలో విమర్శిస్తున్నారు.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నేతలపై దాడులు పెరిగిపోయాయని కక్ష పూరితంగా జగన్ వ్యవహరిస్తున్నారు అని, కావాలనే కొందరిని టార్గెట్ చేస్తున్నారు అని విమర్శలు చేశారు.

ఇక అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబు సీమ పౌరుషం చూపించారు అని అంటున్నారు టీడీపీ నేతలు.. తాను తలచుకుంటే గత ఎన్నికల సమయంలో వైసీపీ నేతలని ఇబ్బందులు పెట్టి ఉంటే అందరూ టార్గెట్ అయ్యేవారని, తాను కక్ష పూరిత రాజకీయాలు చేయను అని తెలియచేశారు ఆయన.

తాజాగా జగన్ సర్కారుని వైసీపీ నేతలని ఆయన విమర్శించారు. పోలీసులను పక్కన పెట్టండి.. మీరో మేమో తేల్చుకుందాం రండి అని సవాల్ విసిరారు. ఎక్కడకు రమ్మంటారో చెప్పండి. అంటూ సీరియస్ అయ్యారు
చంద్రబాబు.తను అధికారంలో ఉన్నప్పుడు తలుచుకుని ఉంటే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ మిగిలే వారు కాదని ఆయన ప్రకటించారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఏమంటారో చూడాలి, మొత్తానికి బాబు ఇక వైసీపీ పై యుద్దానికి సిద్దం అవుతున్నారు అనే చెప్పాలి.