చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జేసీ బ్రదర్స్

చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జేసీ బ్రదర్స్

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో భారీ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా రాయలసీమలో టీడీపీకి కంచుకోట అయినటువంటి అనంతపురం జిల్లానుంచి చంద్రబాబుకు భారీ షాక్ తగలనుంది.

ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ త్వరలో బీజేపీలో చేరనుందని ప్రచారం జరుగుతోంది… ఇప్పటికే నలుగురు బలమైన రాజ్యసభ సభ్యులను కోల్పోయిన చంద్రబాబు ఇప్పుడు జేసీ కూడా జంప్ చేస్తే టీడీపీకి రానున్న రోజుల్లోకష్టాలు తప్పవని అంటున్నారు…

అంతేకాదు ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి… ప్రస్తుతం మోడీ హావా నడుస్తోందని అందుకే చాలామంది బీజేపీలో చేరుతున్నారని అన్నారు.

ఏపీలోకూడా చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని తప్పులు మోడీ ప్రవేశ పెట్టిన పథకావల్ల టీడీపీ చెందిన వారుబీజేపీలో చేరుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే జేసీ కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని అంటున్నారు