చంద్రబాబు తుపాకులు కొని సాయుధ పోరాటం

చంద్రబాబు తుపాకులు కొని సాయుధ పోరాటం

0

ప్రస్తుతం అమరావతిలో ఎక్కడైనా ప్రాణం పోతుందా అని ప్రతిపక్ష నాయకులు రాబందుల్లాగా కుర్చున్నారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు.. జయము జయము చంద్రన్న భజనతో మొదలై జోలె పట్టుకునే వరకు వెళ్లింది ఉద్యమం ఆరోపించారు…

40 ఇయర్స్ ఇండస్ట్రీ 4 వేల ఎకరాల ఇన్ సైడర్ భూముల కోసం పడరాని పాట్లు పడుతోందని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఒక ప్రాణం పోతుందా అని రాబందులాగా కాచుక్కూర్చుందిని అన్నారు.. ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు కొన్న మీ బినామీలు, అనుచర వర్గం ఆస్తులు లక్ష కోట్ల పైనే ఉంటాయని ఆరోపించారు.

గంటలో వెయ్యి కోట్లు పోగు చేసే స్థోమత ఉన్నోళ్లు మీరంతా అని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. మీరివ్వకుండా జనం మీద పడి జోలె చాపడం ఏమిటి చంద్రబాబూ? తుపాకులు కొని సాయుధ పోరాటం మొదలు పెడతారా ఏంటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు…