చంద్రబాబుకు షాక్ ముఖ్యనేత రాజీనామా

చంద్రబాబుకు షాక్ ముఖ్యనేత రాజీనామా

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా షాక్ లు తగులుతున్నాయి.. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు టీడీపీకి రాజీనామా చేస్తున్నారు… అధికారం కోల్పోవడంతో ఏపీలో చాలామంది టీడీపీ నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు.

ఇక ఇదే క్రమంలో తెలంగాణలో పార్టీ అంతంతగా ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేశారు… ప్రస్తుతం టీడీపీ రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తుందని అందుకే తాను పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు…

గతంలో ఎన్టీఆర్ ఏ సిద్దాంతాలను అనుసరించి పార్టీని స్థాపించారో ఇప్పుడు అవి టీడీపీలో లేవని అన్నారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి వీరేందర్ గౌడ్ అందజేశారు.