చంద్రబాబుకి మరో బిగ్ షాకిచ్చిన మంచు ఫ్యామిలీ

0

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు కి , మంచు మోహన్ బాబుకి మధ్య పచ్చగడ్ది వేస్తే భగ్గుమంటోంది, గతంలో తమ కాలేజీకి చెల్లించాల్సిన రీయింబర్స్ మెంట్ విషయంలో బాబు పరువు తీసేశారు కలెక్షన్ కింగ్, అయితే ఎన్నికల ముందు వైసీపీలో చేరిపోయారు మోహన్ బాబు.ఇక జగన్ గెలిచిన తర్వాత మంచు ఫ్యామిలీ జగన్ తో ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు, అయితే ఈ సమయంలో చంద్రబాబుపై పలు సంచలన కామెంట్లు చేశారు మోహన్ బాబు. ఇంతకీ ఏ విషయంలో అనేది చూద్దాం.

చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.

క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా అని ట్వీట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు ఆయన.