చరణ్ తో అదిరిపోయే సీన్ తీసిన రాజమౌళి

చరణ్ తో అదిరిపోయే సీన్ తీసిన రాజమౌళి

0

రామ్ చరణ్ తేజ్ కోర్టు మెట్లు ఎక్కడం ఇది రెండు రోజులుగా వార్తగా వినిపిస్తోంది.. ఏమిటి చిరు ఫ్యామిలీలో చరణ్ కు ఇలాంటి పరిస్దితి ఎందుకు వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా ..ఆగండి నిజంగా చరణ్ కోర్టుకి వెళ్లట్లేదు మెట్లు ఎక్కడం లేదు.రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రంలో మాత్రమే ఇది సీన్ గా తీస్తున్నారు . దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్, మల్టీస్టారర్ చిత్రం RRR. ఈ సినిమాలో ఇద్దరూ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు.

మరి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.. ఇక చరణ్ తాజాగా కోర్టుకి వెళ్లి బోనులో నిలబడి తన గురించి జడ్జి ముందు తన పోరాటం గురించి చెప్పే సీన్ షూటింగ్ జరుగుతోందట. అయితే కీలక నటులతో ఉండే సీన్ కి ఆనాటి సెట్స్ వేశారు అని తెలుస్తోంది.రామ్ చరణ్, స్వాతంత్ర్య ఉద్యమకారుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. సో చరణ్ పై ఎంతో కీలక సన్నివేశాలు అనుకున్న ఈ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

ఇక చరణ్ కూడా ఎమోషనల్ డైలాగ్ డెలివరీతో ఈ షెడ్యూల్ పూర్తి చేశారని తెలుస్తోంది, అయితే దాదాపు మరో 45 మంది ఆకోర్టు సీన్ లో నటిస్తున్నారట, జక్కన్న ఎలా తెరకిక్కిస్తున్నారో అనే ఆత్రుత అందరిలో కనిపిస్తోంది.